గురువారం 21 జనవరి 2021
Sports - Dec 12, 2020 , 01:01:40

రోహిత్‌ రెడీ

రోహిత్‌ రెడీ

  • ఫిట్‌నెస్‌ పరీక్ష పాసైన హిట్‌మ్యాన్‌
  • 14న ఆస్ట్రేలియాకు పయనం!

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌ పరీక్షలో నెగ్గి ఆస్ట్రేలియా బయల్దేరేందుకు సిద్ధమయ్యాడు. దుబాయ్‌ వేదికగా జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌లో తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడ్డ రోహిత్‌ శుక్రవారం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో నిర్వహించిన ఫిట్‌నెస్‌ టెస్టులో పాసయ్యాడు. ఈ నెల 14న అతడు ఆసీస్‌ పయనమయ్యే అవకాశాలున్నాయి. ‘రోహిత్‌ ఫిట్‌నెస్‌ టెస్టులో నెగ్గాడు. అతి త్వరలో అతడు ఆసీస్‌ వెళ్తాడు’అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగం గా అడిలైడ్‌ వేదికగా ఈ నెల 17న జరుగనున్న తొలి టెస్టు అనంతరం పితృత్వ సెలవులపై కోహ్లీ స్వదేశానికి తిరిగి రానుండగా.. మూడో టెస్టు నుంచి రోహిత్‌ అందుబాటులో ఉండనున్నాడు. ఆసీస్‌లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు 14 రోజులు క్వారంటైన్‌లో ఉండటం తప్పనిసరి అని అక్కడి ప్రభుత్వం నిబంధనలు విధించడంతో రోహిత్‌ తొలి రెండు టెస్టులకు దూరం కావాల్సి వస్తున్నది.


logo