సోమవారం 01 మార్చి 2021
Sports - Feb 13, 2021 , 11:01:30

రోహిత్ అర్ధ సెంచ‌రీ.. భార‌త్ 77/1

రోహిత్ అర్ధ సెంచ‌రీ.. భార‌త్ 77/1

చెన్నై చెపాక్ స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భార‌త్ పటిష్ట స్థితిలో నిలిచింది. సున్నా ప‌రుగుల‌కే శుభ్‌మ‌న్ గిల్‌(0) వికెట్ కోల్పోయిన‌ప్ప‌టికీ, రోహిత్ శ‌ర్మ ( 57) అర్ధ సెంచ‌రీతో వికెట్ న‌ష్టానికి 77 ప‌రుగులు చేసింది. రోహిత్ వ‌న్డే త‌ర‌హాలో బ్యాట్ ఝుళిపిస్తూ వీలైన్న‌ని ఎక్కువ ప‌రుగులు రాబ‌డుతున్నాడు. మ‌రో ఎండ్‌లో ఉన్న పుజారా ( 20) ఆచితూచి ఆడుతూ చెత్త బంతుల‌ని బౌండ‌రీకి త‌ర‌లిస్తున్నాడు. ఈ టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకునో్న భార‌త్ వీలైన‌న్ని ప‌రుగులు చేసి ఇంగ్లండ్‌ను ఇబ్బందులోకి నెట్టాల‌ని చూస్తుంది. కాగా, తొలి టెస్ట్‌లో భార‌త్ ఘోర ప‌రాజ‌యాన్ని చ‌వి చూడ‌గా, రెండో టెస్ట్‌లో గెలిచి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని భావిస్తుంది. 

VIDEOS

logo