శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sports - Oct 27, 2020 , 15:10:11

ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్‌!

ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్‌!

ముంబై  ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొడకండరాల గాయంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. గాయం కారణంగా ముంబై ఆడిన గత రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తొడ కండరాల గాయం తిరగబెట్టడంతో హిట్‌మ్యాన్‌ ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లు ఆడతాడో లేదో అనుమానంగా మారింది.

వారం రోజుల విరామం తర్వాత   రోహిత్‌ మళ్లీ బ్యాట్‌ పట్టాడు. సోమవారం రాత్రి ముంబై ప్రాక్టీస్‌ సెషన్‌లో నెట్స్‌లో సాధన చేశాడు.  అబుదాబి వేదికగా బుధవారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో ముంబై తలపడనుంది.  ప్రస్తుతం రోహిత్‌ గాయం తీవ్రతపై ఎలాంటి స్పష్టత రాలేదు. ప్లేఆఫ్‌ బెర్తు/ టేబుల్‌ టాపర్‌గా నిలువాలని ముంబై పట్టుదలతో ఉండటంతో   బెంగళూరుతో మ్యాచ్‌ ఆడేందుకు రోహిత్‌ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తున్నది.   

ముంబై ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో 14 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌, బెంగళూరు జట్లు కూడా   14  పాయింట్లతో ఉన్నాయి.   గత కొద్దిరోజులుగా పంజాబ్‌తో పాటు కొన్ని జట్లు అనూహ్య ప్రదర్శన చేస్తుంటంతో ప్లే బెర్తుకు పోటీ పెరిగింది.