గురువారం 09 జూలై 2020
Sports - Apr 19, 2020 , 17:28:07

రోహిత్ బ్యాటింగ్ క‌విత్వంలా ఉంటుంది

రోహిత్ బ్యాటింగ్ క‌విత్వంలా ఉంటుంది

హిట్‌మ్యాన్‌పై ఇర్ఫాన్ ప‌ఠాన్ ప్ర‌శంస‌ల జ‌ల్లు

న్యూఢిల్లీ:  టీమ్ఇండియా స్టార్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ బ్యాటింగ్ క‌విత్వాన్ని పోలి ఉంటుందని.. అందులోని సొగ‌సు గురించి ఎంత చెప్పినా త‌క్కువే అని భార‌త మాజీ పేస‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ అన్నాడు. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఐపీఎల్ ర‌ద్దు కావ‌డంతో ఇండ్ల‌కే ప‌రిమిత‌మైన క్రికెట‌ర్లు సామాజిక మాధ్య‌మాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో టీమ్ఇండియా పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీతో మాట్లాడిన ఇర్ఫాన్ హిట్‌మ్యాన్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు.

`మైదానంలో రోహిత్ శ‌ర్మ ఆడుతుంటే.. స్టార్ బ్యాట్స్‌మ‌న్‌లా కాకుండా.. అత‌డో క‌విలా క‌నిపిస్తాడు. అత‌డి బ్యాటింగ్ చ‌క్క‌టి క‌విత్వాన్ని త‌ల‌పిస్తుంది. క‌విత్వం ఏ విధంగానైతే సున్నితంగా సుకుమారంగా అనిపిస్తుందో.. అత‌డి బ్యాటింగ్ అచ్చం అలాగే అనిపిస్తుంది` అని ఇర్ఫాన్ అన్నాడు. దీనికి ష‌మీ బ‌దులిస్తూ.. `రోహిత్ గొప్ప ఓపెన‌ర్‌. అత‌డు క్రికెట్‌లోని అన్నీ నైపుణ్యాలు తెలిసిన ప్యాకేజీ లాంటివాడు. యువ బ్యాట్స్‌మెన్ అత‌డి ఆట చూసి ఎంతో నేర్చుకోవ‌చ్చు`అని పేర్కొన్నాడు.logo