శుక్రవారం 15 జనవరి 2021
Sports - Dec 31, 2020 , 13:20:15

టీమంతా హోటల్‌లో.. రోహిత్ నెట్స్‌లో..

టీమంతా హోటల్‌లో.. రోహిత్ నెట్స్‌లో..

మెల్‌బోర్న్‌: బాక్సింగ్ డే టెస్ట్‌లో అద్భుత విజ‌యం సాధించిన ఇండియ‌న్ టీమ్ అంతా రెండు రోజుల హాలిడేను ఎంజాయ్ చేస్తుంటే.. రోహిత్ శ‌ర్మ మాత్రం నెట్స్‌లో చెమ‌టోడుస్తున్నాడు. ఆస్ట్రేలియాలో 14 రోజుల క్వారంటైన్‌ను ముగించుకొని టీమ్‌తో క‌లిసిన రోహిత్‌.. ఏమాత్రం టైమ్ వేస్ట్ చేయ‌కుండా ఫీల్డ్‌లోకి అడుగుపెట్టాడు. బ్యాటింగ్ కోచ్ విక్ర‌మ్ రాథోడ్‌, మ‌రో ముగ్గురు మాత్ర‌మే రోహిత్‌కు సాయం చేయ‌డానికి మెల్‌బోర్న్ గ్రౌండ్‌కు వ‌చ్చిన‌ట్లు స్పోర్ట్స్ అన‌లిస్ట్ బోరియా మ‌జుందార్ ట్వీట్ చేశారు. ఐపీఎల్లో గాయం కార‌ణంగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌తోపాటు తొలి రెండు టెస్ట్‌ల‌కు రోహిత్ దూర‌మ‌య్యాడు. సిడ్నీలో జ‌ర‌గ‌బోయే మూడో టెస్ట్‌కు అత‌డు అందుబాటులో ఉండ‌నున్నాడు. నిజానికి గురువార‌మే ఇండియా, ఆస్ట్రేలియా టీమ్స్ సిడ్నీ వెళ్లాల్సి ఉన్నా.. అక్క‌డి కొవిడ్ ప‌రిస్థితుల కార‌ణంగా జ‌న‌వ‌రి 4కు ప్ర‌యాణాన్ని వాయిదా వేశారు.