సోమవారం 25 జనవరి 2021
Sports - Dec 17, 2020 , 12:09:23

కోహ్లి, రోహిత్ ఫ్యాన్స్ మ‌ధ్య చిచ్చు పెట్టిన ఆస్ట్రేలియా జ‌ర్న‌లిస్ట్‌

కోహ్లి, రోహిత్ ఫ్యాన్స్ మ‌ధ్య చిచ్చు పెట్టిన ఆస్ట్రేలియా జ‌ర్న‌లిస్ట్‌

అడిలైడ్‌: టీమిండియా ప్లేయ‌ర్స్ విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ మ‌ధ్య ఏదో గొడ‌వ న‌డుస్తోంద‌ని ఎప్ప‌టి నుంచో అభిమానులు అనుమానిస్తున్న‌దే. ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో కెప్టెన్‌, వైస్ కెప్టెన్ అయిన ఈ ఇద్ద‌రిలో ఎవ‌రు గ్రేట్ ప్లేయ‌ర్ అన్న విష‌యంలో అభిమానుల మ‌ధ్య కూడా ఎప్పుడూ వార్ న‌డుస్తూనే ఉంటుంది. అయితే తాజాగా మ‌రోసారి ట్విట‌ర్‌లో ఈ ఇద్ద‌రు ప్లేయ‌ర్స్ అభిమానులు గొడ‌వకు దిగారు. ఈసారి ఓ ఆస్ట్రేలియా జ‌ర్న‌లిస్ట్ నిప్పు రాజేసింది. రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి అభిమానులు ఒక‌రినొక‌రు ఎందుకంత‌లా ద్వేషిస్తారు? ఆ ఇద్ద‌రూ ఇండియ‌న్ ప్లేయ‌ర్సే క‌దా. నాకు స‌మాధానం కావాలి అంటూ క్లోయీ అమందా బెయిలీ అనే జ‌ర్న‌లిస్ట్ ట్వీట్ చేసింది. యే గునా హై (ఇది నేరం) అంటూ న‌సీరుద్దీన్ షా డైలాగ్‌ను కూడా పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు.. మ‌ళ్లీ యుద్ధం మొద‌లుపెట్టారు. ఎందుకంటే రోహిత్‌ను కోహ్లి చాలా సార్లు మెచ్చుకున్నాడు కానీ.. రోహిత్ ఎప్పుడూ కోహ్లిని మెచ్చుకోలేద‌ని ఒక‌రు.. కోహ్లి ఖాతాలో ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా లేదు క‌దా.. అందుకే అత‌న్ని చూసి రోహిత్ కుళ్ల‌కుంటాడ‌ని మ‌రొక‌రు ట్వీట్లు చేశారు. 


logo