శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Oct 17, 2020 , 17:53:33

డీడీసీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన రోహన్‌ జైట్లీ

డీడీసీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన  రోహన్‌ జైట్లీ

న్యూఢిల్లీ: ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) నూతన  అధ్యక్షుడిగా దివంగత మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కుమారుడు రోహన్‌ జైట్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  2021 జూన్‌ 30 వరకు రోహన్‌ ఆ పదవిలో కొనసాగనున్నారు. మిగిలిన ఆఫీస్‌ బేరర్ల(ట్రెజరర్‌, డైరెక్టర్‌) కోసం నవంబర్‌ 5,6,8 తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్‌ 9న ఫలితాలు ప్రకటిస్తారు. 

వృత్తిరీత్యా న్యాయవాది అయిన రోహన్‌ నామినేషన్ల చివరి రోజున   నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు.  అధ్యక్ష పదవికి నామినేషన్‌ దాఖలు చేసిన  మరో వ్యక్తి  సునీల్‌ కుమార్‌ గోయెల్‌ తన   నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో  రోహన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  రోహన్‌ తండ్రి అరుణ్ జైట్లీ 1999 నుంచి 2013 వరకు డీడీసీఏ అధ్యక్షుడిగా పనిచేశారు.