గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Jan 28, 2020 , 13:54:23

మెల్‌బోర్న్ మిరాకిల్‌.. ఫెద‌ర‌ర్ స్ట‌న్నింగ్ విక్ట‌రీ

మెల్‌బోర్న్ మిరాకిల్‌.. ఫెద‌ర‌ర్ స్ట‌న్నింగ్ విక్ట‌రీ

హైద‌రాబాద్‌: ఓట‌మి అంచుల నుంచి అద్భుత‌మైన రీతిలో ఫెద‌ర‌ర్ గ‌ట్టెక్కాడు.  ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫెద‌ర‌ర్‌.. ఓ ద‌శ‌లో ఏడు మ్యాచ్ పాయింట్ల‌ను కాపాడుకున్నాడు.  మెల్‌బోర్న్‌లోని లాడ్ లావ‌ర్ ఎరినాలో జ‌రిగిన థ్రిల్లింగ్ క్వార్ట‌ర్స్‌ మ్యాచ్‌లో ఫెద‌ర‌ర్ విజ‌యం సాధించాడు.  దీంతో  ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ సెమీస్‌లోకి రోజ‌ర్ ఫెద‌ర‌ర్ ఎంట‌ర్ అయ్యాడు. ఇవాళ జ‌రిగిన క్వార్ట‌ర్స్‌లో ఫెడెక్స్ 6-3 2-6 2-6 7-6 6-3  స్కోర్‌తో టెన్నిస్ సాండ్‌గ్రెన్‌పై గెలుపొందాడు.  ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో ఫెద‌ర‌ర్  సెమీస్‌కు వెళ్ల‌డం ఇది 15వ సారి.  తొలి సెట్‌ను ఈజీగానే గెలిచినా.. ఆ త‌ర్వాత వరుస‌గా రెండు సెట్ల‌ను కోల్పోయి ఫెడెక్స్ ఇబ్బందుల్లో ప‌డ్డాడు. కానీ కీల‌క‌మైన నాలుగ‌వ సెట్‌ను టై బ్రేక‌ర్‌లో గెలుచుకుని మ్యాచ్‌పై ఆశ‌లు నిలుపుకున్నాడు. ఆ త‌ర్వాత చివ‌రి సెట్‌ను కైవ‌సం చేసుకుని.. సెమీస్‌లోకి ఫెద‌ర‌ర్ ప్ర‌వేశించాడు. ఈ మ్యాచ్ 3 గంట‌ల 28 నిమిషాల పాటు సాగింది.    


logo