ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Oct 01, 2020 , 11:16:38

పొర‌పాటున బంతికి ఉమ్మి రాసిన‌ ఊత‌ప్ప‌..

పొర‌పాటున బంతికి ఉమ్మి రాసిన‌ ఊత‌ప్ప‌..

హైద‌రాబాద్‌: రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ప్లేయ‌ర్ రాబిన్ ఊత‌ప్ప‌.. పొర‌పాటున బంతికి ఉమ్మి రుద్దాడు.  ఈ ఘ‌ట‌న కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చోటుచేసుకున్న‌ది.  ప్ర‌స్తుతం కరోనా వైర‌స్ నిబంధ‌నల నేప‌థ్యంలో.. ఐసీసీ నియ‌మావ‌ళి ప్ర‌కారం బంతికి ఉమ్మి రాయ‌డం నిషేధం.  మ్యాచ్  మూడ‌వ ఓవ‌ర్‌లో సునిల్ న‌రేన్ కొట్టిన భారీ షాట్ గాల్లోకి ఎగిరింది. అయితే రాబిన్ ఊత‌ప్ప చేతుల్లోకి ఆ బంతి వెళ్లినా అత‌ను క్యాచ్‌ను వ‌దిలేశాడు. క్యాచ్ డ్రాప్ చేసిన వెంట‌నే అత‌ను అనుకోకుండా త‌న నోటి ఉమ్మిని బంతికి రాశాడు.  ఒక ఇన్నింగ్స్‌లో తాజా రూల్స్ ప్ర‌కారం రెండు సార్లు మాత్ర‌మే ఇలాంటి పొర‌పాట్ల‌కు అవ‌కాశం ఉంటుంది. ఒక‌వేళ ప‌దేప‌దే ఇవే పొర‌పాట్లు చేస్తే అప్పుడు 5 ప‌రుగుల పెనాల్టీ విధిస్తారు.  రాజస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కోల్‌క‌తా 37 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.