సోమవారం 06 జూలై 2020
Sports - Jun 26, 2020 , 00:33:15

రాబిన్‌సింగ్‌ కారు సీజ్‌

రాబిన్‌సింగ్‌ కారు సీజ్‌

చెన్నై: లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా భారత మాజీ క్రికెటర్‌ రాబిన్‌ సింగ్‌పై జరిమానా పడింది. కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ ఎక్కువగా ఉండటంతో జూన్‌ 19 నుంచి 30 వరకు చెన్నై నగరంలో లాక్‌డౌన్‌ విధించగా.. నిబంధనలకు విరుద్ధంగా రాబిన్‌ నిత్యావసర వస్తువులు కొనేందుకు గురువారం ఇంటి నుంచి బయటకు వచ్చాడు. దీంతో అతడిపై రూ. 500 జరిమానా విధించడంతో పాటు కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


logo