శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Sports - Mar 06, 2020 , 16:06:13

మళ్లీ బ్యాట్ పట్టనున్న సచిన్, సెహ్వాగ్, యువీ

మళ్లీ బ్యాట్ పట్టనున్న సచిన్, సెహ్వాగ్, యువీ

ముంబై:  బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, బ్రియన్ లారా ప్రత్యర్థులుగా బరిలో దిగి తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.  మైదానంలో మళ్లీ బ్యాట్ పట్టి బౌలర్లపై విరుచుకుపడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరితో పాటు మరికొంత మంది మాజీ క్రికెటర్లు మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌-2020లో భాగంగా మార్చి 7వ తేదీ నుంచి వాంఖడే స్టేడియంలో టోర్నీ ఆరంభంకానుంది.  టోర్నమెంట్‌లో మాజీలంతా దుమ్మురేపేందుకు సిద్ధమయ్యారు. తొలి మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్‌, వెస్టిండీస్‌ లెజెండ్స్‌ జట్లు వాంఖడేలో తలపడనున్నాయి. భారత జట్టుకు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ నాయకత్వం వహించనున్నాడు.

ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, భారత్‌కు చెందిన మాజీ ఆటగాళ్లు లెజెండ్స్‌ పేరుతో టోర్నీలో సందడి చేయనున్నారు. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్‌ సింగ్‌, జహీర్‌ ఖాన్‌లు.. విండీస్‌ నుంచి చందర్‌పాల్‌, ఆసీస్‌ నుంచి బ్రాడ్‌ హాడ్జ్‌, బ్రెట్‌ లీ, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌,  శ్రీలంక బౌలింగ్ గ్రేట్ మురళీధరన్‌, దిల్షాన్‌, అజంత మెండీస్‌ తదితరులు  మార్చి 22(ఫైనల్‌) వరకు  వివిధ మైదానల్లో జరిగే మ్యాచ్‌ల్లో పాల్గొంటారు.  తమ అభిమానులను ఉర్రూతలూగించేందుకు ఆటగాళ్లంతా జట్లుగా విడిపోయి మ్యాచ్‌లు ఆడనున్నారు.  రోడ్‌ సేఫ్టీపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐదు టీమ్‌లు రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్‌లో పోటీపడతాయి. 

ఇండియా లెజెండ్స్‌:

సచిన్‌ టెండూల్కర్‌(కెప్టెన్‌), సెహ్వాగ్‌, యువరాజ్‌, అజిత్‌ అగార్కర్‌, సంజయ్‌ బంగర్‌, మునాఫ్‌ పటేల్‌, మహ్మద్‌ కైఫ్‌, ప్రజ్ఞాన్‌ ఓజా, సాయిరాజ్‌ బహుతులే, కురువిల్లా, జహీర్‌ ఖాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, సమీర్‌ దిగే


logo