శనివారం 27 ఫిబ్రవరి 2021
Sports - Feb 08, 2021 , 00:36:44

సఫారీలకు గెలుపు ఆశలు

సఫారీలకు గెలుపు ఆశలు

  • పాకిస్థాన్‌తో రెండో టెస్టు 

రావల్పిండి: పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికాకు గెలుపు ఆశలు చిగురించాయి. 370 పరుగుల లక్ష్యఛేదనలో ఓపెనర్‌ మార్క్మ్‌ (59), వాండర్‌ డసెన్‌ (48) ధాటిగా ఆడి క్రీజులో అజేయంగా నిలువడంతో సఫారీలు పోటీలోకి వచ్చారు. వారిద్దరి ప్రదర్శనతో ఆదివారం నాలుగో రోజును దక్షిణాఫ్రికా ఓ వికెట్‌ కోల్పోయి 127 పరుగుల వద్ద ముగించింది. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్న సఫారీలు.. చివరి రోజు మరో 243 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు మహమ్మద్‌ రిజ్వాన్‌ (115 నాటౌట్‌) అజేయ శతకం సాధించడంతో పాకిస్థాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 298 రన్స్‌కు ఆలౌటై ఓవరాల్‌గా 369 పరుగుల ఆధిక్యం సాధించింది. టేలెండర్‌ నౌమన్‌ అలీ (45) సాయంతో తొమ్మిదో వికెట్‌కు రిజ్వాన్‌ 97 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. 143 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును చివరి వరకు నిలిచి ఆదుకున్నాడు. సఫారీ బౌలర్లలో జార్జ్‌ లిండే ఐదువికెట్లు పడగొట్టాడు. 


VIDEOS

logo