శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Aug 04, 2020 , 19:15:00

ప్రాక్టీస్​లో ప్రమాదం: యువ సైక్లిస్ట్ మృతి

ప్రాక్టీస్​లో ప్రమాదం: యువ సైక్లిస్ట్ మృతి

సుగెన్​హీమ్​(జర్మనీ): ప్రాక్టీస్ చేస్తుండగా కారు ఢీ కొట్టడంతో జర్మనీకి చెందిన యువ సైక్లిస్ట్​ జాన్ రీడ్​మాన్​ 17ఏండ్ల వయసులోనే మృతి చెందాడు. వరల్డ్ టూర్​లో బోరా-హాన్స్​గ్రో​కు చెందిన ఆటో ఎడర్​ బయెర్న్​ జట్టు​లో రీడ్​మా​న్​ సైక్లిస్ట్​గా ఉన్నాడు. కాగా ప్రమాదంలో అతడు మృతి చెందిన విషయాన్ని జట్టు యాజమాన్యం ప్రకటించింది. అండర్​-19 వరల్డ్ టూర్​లో బయెర్న్​​ జట్టులో చోటు దక్కించుకున్న రీడ్​మాన్​.. ఆగ్నేయ జర్మనీలోని సుగెన్​హిమ్ ప్రాంతంలో సోమవారం జట్టు సభ్యులతో కలిసి ప్రాక్టీస్​ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతడి మృతి ఎంతో కలచివేసిందని బోరా-హాన్స్​గ్రో ట్వీట్ చేసింది. 


logo