బుధవారం 24 ఫిబ్రవరి 2021
Sports - Feb 14, 2021 , 15:52:12

భారత్‌, ఇంగ్లాండ్‌ రెండో టెస్టు: ఆ సూపర్‌ క్యాచ్‌లు చూడాల్సిందే

భారత్‌, ఇంగ్లాండ్‌ రెండో టెస్టు: ఆ సూపర్‌ క్యాచ్‌లు చూడాల్సిందే

చెన్నై: ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో భారత వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌, వైస్‌ కెప్టెన్‌ ఆజింక్య రహానె తమ ఫీల్డింగ్‌ విన్యాసాలతో ఆకట్టుకున్నారు. వికెట్ల వెనక  మెరుపు వేగంతో కళ్లుచెదిరే క్యాచ్‌లు అందుకున్నారు.  భారత్‌లో తొలి టెస్టు ఆడుతున్న హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ తన తొలి బంతికే వికెట్‌ తీశాడు. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో  సిరాజ్‌ వేసిన బంతిని ఇంగ్లీష్‌ బ్యాట్స్‌మన్‌ ఓలీ పోప్‌ ఫ్లిక్‌ చేసేందుకు ప్రయత్నించగా బంతి అతని గ్లోవ్‌కు తగిలింది.

బంతి తన ఎడమవైపు వెళ్తుండగా పంత్‌ సూపర్‌ మ్యాన్‌ తరహాలో డైవ్‌ చేసి అందుకున్నాడు. రహానె కూడా స్టన్నింగ్‌ క్యాచ్ పట్టేశాడు. అక్షర్‌ పటేల్‌ వేసిన బంతిని  మొయిన్‌ అలీ  డిఫెన్స్‌ ఆడగా  ఎడ్జ్‌ తీసుకున్న బంతి పంత్‌ ప్యాడ్‌కు తగిలి..అక్కడే గాల్లోకి లేచింది. స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న రహానె డైవ్‌ చేసి  క్యాచ్‌ అందుకున్నాడు. ఈ క్యాచ్‌లు మ్యాచ్‌లోనే హైలెట్‌గా నిలిచాయి. 

VIDEOS

logo