శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Sports - Feb 09, 2021 , 01:33:52

పంత్‌కే తొలి ‘మంత్‌' అవార్డు

పంత్‌కే తొలి ‘మంత్‌' అవార్డు

దుబాయ్‌: ఐసీసీ కొత్తగా ప్రవేశపెట్టిన ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌' అవార్డు భారత యువ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ను వరించింది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌లో దుమ్మురేపిన పంత్‌.. జనవరికి గాను ప్రపంచ మేటి ఆటగాడిగా ఎన్నికై తొలి పురస్కారాన్ని చేజిక్కించుకున్నాడు. సిడ్నీ టెస్టులో 97 పరుగులతో అదరగొట్టిన రిషబ్‌.. బ్రిస్బేన్‌లో అజేయంగా 89 పరుగులు బాది భారత్‌కు టెస్టు సిరీస్‌ విజయాన్ని అందించాడు. కాగా ఉత్తరాఖండ్‌ జల విలయంలో గల్లంతయిన వారి కోసం జరుగుతున్న సహాయక చర్యలకు పంత్‌ సాయం అందించాడు. చెన్నై టెస్టు మ్యాచ్‌ ఫీజును విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌లోని రూకీకి చెందిన పంత్‌.. తన రాష్ట్రంలో సంభవించిన ఈ ప్రమాదంపై ఆవేదన వ్యక్తం చేశాడు. 

VIDEOS

logo