బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Oct 24, 2020 , 18:17:43

KKR vs DC: నిదానంగా ఆడుతున్న ఢిల్లీ

KKR vs DC: నిదానంగా ఆడుతున్న ఢిల్లీ

అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్దేశించిన 195 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ స్వల్ప స్కోరుకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.  స్టార్‌ పేసర్‌ పాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌ ధాటికి ఢిల్లీ 13 పరుగులకే రెండు వికెట్లు చేజార్చుకుంది. కమిన్స్‌ వేసిన ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌ తొలి బంతికే రహానె ఎల్బీడబ్లూగా వెనుదిరిగాడు. మళ్లీ తన తర్వాతి ఓవర్‌లోనే సూపర్‌ ఫామ్‌లో ఉన్న శిఖర్‌ ధావన్(6)‌ బౌల్డ్‌ అయ్యాడు.   9 ఓవర్లకు ఢిల్లీ 2 వికెట్లకు 58 పరుగులు చేసింది. రిషబ్‌ పంత్‌(23), శ్రేయస్‌ అయ్యర్‌(24) క్రీజులో ఉన్నారు.