కరోనా మహమ్మారి వలన విచిత్ర పరిస్థితులని చూడాల్సి వస్తుంది. మనిషికి మనిషి సాయం చేసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. రోజులకు లక్షలలో కేసులు వస్తుండడంతో ఆక్సీజన్, రెమిడెసివిర్ టీకాల లోటు ఏర్పడింది. దీంతో ఏం చేయాలో తెలియక జనాలు గగ్గోలు పెడుతున్నారు. తాజాగా కిరాక్ పార్టీలో యంగ్ హీరో నిఖిల్ సరసన నటించిన సంయుక్త హెగ్డే తన తండ్రికి రెమిడెసివిర్ టీకా కావాలని మొర పెట్టుకుంటుంది.
సంయుక్త హెగ్డే తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో వారికి రెమిడెసివిర్ టీకా అత్యవసరం అట. అయితే తన తండ్రికి ఆరు రెమిడెసివిర్ ఇంజెక్షన్స్ అవసరం అని చెబుతున్న సంయుక్త వాటి కోసం ఎంతో మందిని సంప్రదించాను అంటుంది. అయిన ఉపయోగం లేదు. ఆసుపత్రికి వెళ్లడానికి ఆయన నిరాకరిస్తున్నారు. బెంగళూరులోని మా ఇంట్లో ఉంచి చూసుకుంటున్నాం. ప్రస్తుతం వారి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. ఇంజక్షన్స్ ఉన్న వాళ్లు నాకు సాయం చేసి నా తల్లిదండ్రులని కాపాడండి అంటూ వేడుకుంటుంది సంయుక్త.