శనివారం 26 సెప్టెంబర్ 2020
Sports - Sep 08, 2020 , 15:25:25

పంత్ ఫటాఫట్..సిక్సర్ల వీడియో వైరల్‌

పంత్ ఫటాఫట్..సిక్సర్ల వీడియో వైరల్‌

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌ మరో పది రోజుల్లో ఆరంభంకానుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్ల ఆటగాళ్లు ముమ్మరంగా సాధన చేస్తున్నారు. కరోనా విరామంతో ఆటకు దూరమైన ప్లేయర్లు మళ్లీ గాడిలో పడుతున్నారు.  ఢిల్లీ క్యాపిటల్స్‌ డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ నెట్‌ ప్రాక్టీస్‌లో భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. షార్జాలో సోమవారం సాయంత్రం నెట్‌ సెషన్‌లో స్పిన్నర్ల బౌలింగ్‌లో  తన ట్రేడ్‌మార్క్‌ స్టైల్‌లో  పంత్‌ సిక్సర్లు బాదాడు.  మంచి కసిమీద ఉన్న పంత్‌  వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు.

వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పంత్‌ గతకొన్నేళ్లుగా జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.  ఈనెల 20వ తేదీన దుబాయ్‌ వేదికగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో తొలి మ్యాచ్‌లో ఢిల్లీ తలపడనుంది.  రాబోయే ఐపీఎల్‌ సీజన్‌లో విశేషంగా రాణించి భారత జాతీయ జట్టులో మళ్లీ చోటుదక్కించుకోవాలని భావిస్తున్నాడు.  మూడు వేర్వేరు దిశల్లో పంత్‌ భారీ షాట్లు ఆడిన వీడియోను ఫ్రాంఛైజీ ట్విటర్లో షేర్‌ చేసింది.  ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.  


logo