శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Oct 09, 2020 , 20:29:12

IPL 2020: టాపార్డర్‌ ఢమాల్‌..కష్టాల్లో ఢిల్లీ

IPL 2020: టాపార్డర్‌ ఢమాల్‌..కష్టాల్లో  ఢిల్లీ

షార్జా: రాజస్థాన్‌ రాయల్స్‌తో  జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌  కష్టాల్లో పడింది. రాజస్థాన్‌ బౌలర్ల ధాటికి 79 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో పృథ్వీ షా(19), శిఖర్‌ ధావన్‌(5) వెనుదిరగ్గా.. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్(22)‌, రిషబ్‌ పంత్‌(5) రనౌట్‌ కావడంతో ఢిల్లీపై ఒత్తిడి పెరిగింది.  ఆరంభం నుంచి బౌలర్లు ధాటిగా బంతులేస్తుండగా..ఫీల్డర్లు మైదానంలో చురుగ్గా కదులుతూ అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంటున్నారు.

ప్రస్తుతం స్టార్‌ ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టాయినీస్‌ మెరుపు బ్యాటింగ్‌తో బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. మరో ఎండ్‌లో హెట్‌మైర్(4)‌.. స్టాయినీస్‌(33)కు సహకారం అందిస్తున్నాడు.  11 ఓవర్లకు ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది.