శనివారం 11 జూలై 2020
Sports - May 03, 2020 , 01:15:56

సమస్య ఏదైనా ధోనీనే సంప్రదిస్తా

సమస్య ఏదైనా ధోనీనే సంప్రదిస్తా

న్యూఢిల్లీ: మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ తనకు మార్గదర్శకుడి లాంటి వాడని టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌  బాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ అన్నాడు. ఎలాంటి సమస్య ఎదుర్కొన్నా తాను మహీని ఎప్పుడైనా సంప్రదించగలనని చెప్పాడు. ఐపీఎల్‌లో తన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో పంత్‌ మాట్లాడాడు. ‘అతడు (ధోనీ) నాకు మెంటార్‌ లాంటివాడు. ఏ సమస్య ఉన్నా నేను మహీభాయ్‌ని సంప్రదిస్తా. దానికి అతడెప్పుడూ పూర్తి పరిష్కారం చెప్పడు. సలహా ఇచ్చి.. సమస్యను స్వయంగా పరిష్కరించుకునే విధంగా చేస్తాడు. ధోనీ నా ఫేవరెట్‌ బ్యాటింగ్‌ భాగస్వామి. ఒకవేళ అతడు క్రీజులో ఉంటే.. అంతా బాగుంటుంది. ఓ ప్రణాళిక రచిస్తాడు.. మనం అతడిని అనుసరిస్తే చాలు’ అని పంత్‌ చెప్పాడు.


logo