మంగళవారం 02 మార్చి 2021
Sports - Jan 19, 2021 , 13:11:31

రిష‌బ్ పంత్ సూప‌ర్ షో..

రిష‌బ్ పంత్ సూప‌ర్ షో..

బ్రిస్బేన్ :  రిష‌బ్ పంత్ మ‌రో కీల‌క ఇన్నింగ్స్‌తో ఆక‌ట్టుకున్నాడు.  బ్రిస్బేన్ టెస్టులో టీమిండియాకు అత్య‌ద్భుత‌ విజ‌యాన్ని అందించాడు.  అజేయ‌మైన హాఫ్ సెంచ‌రీతో ఆసీస్‌కు స్వంత దేశంలోనే చుక్క‌లు చూపించాడు. 137 బంతుల్లో  9 బౌండ‌రీలు, ఓ సిక్స‌ర్‌తో రిష‌బ్ అజేయంగా 89 ర‌న్స్ చేశాడు.   గ‌బ్బా మైదానంలో అయిదో రోజు అసాధార‌ణ ఆట‌తీరుతో ఆసీస్ బౌల‌ర్ల‌ను అల‌వోక‌గా ఎదుర్కొన్నాడు.  ఓ ద‌శ‌లో మ్యాచ్ డ్రా దిశ‌గా వెళ్తుంద‌నుకున్న స‌మ‌యంలో.. పంత్ త‌న ప‌వ‌ర్ గేమ్‌తో థ్రిల్ పుట్టించాడు.  స‌హ‌జ శైలిలోనూ భారీ షాట్లు కొడుతూ.. ఆస్ట్రేలియా ఆటగాళ్ల‌లో టెన్ష‌న్ పుట్టించాడు.  ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు పంత్ తన ఆట‌తీరులో ప్ర‌ద‌ర్శించిన ప‌రిణ‌తి అమోఘం.  టెస్టుల్లో నాలుగ‌వ హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేసిన రిష‌బ్‌.. అనూహ్య రీతిలో టీమిండియాకు విజ‌యాన్ని అందించిన క్రికెట‌ర్‌గా చ‌రిత్ర‌లో నిలిపోయాడు. ట్వెంటీట్వెంటీలా ట్విస్టులు తిరిగిన మ్యాచ్‌లో.. రిష‌బ్ సూప‌ర్ హీరోలా అవ‌త‌రించాడు.

అద్భుత‌మైన బౌలింగ్ లైన‌ప్ ఉన్న ఆసీస్‌ను .. రిష‌బ్ పంత్ ఎంతో చాక‌చ‌క్యంగా ఎదుర్కొన్నాడు.  మిచ‌ల్ స్టార్క్‌,  హేజ‌ల్‌వుడ్‌, ప్యాట్ క‌మ్మిన్స్ , నాథ‌న్ ల‌యాన్ లాంటి హేమాహేమీలను కీల‌క స‌మ‌యంలో పంత్ అత్యంత సులువుగా ఆడేశాడు.  వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ బౌల‌ర్ స్టార్క్ ఈ మ్యాచ్‌లో పేల‌వంగా తేలిపోయాడు.  స్టార్క్ క‌సితో బంతులు వేసినా.. పంత్ అంతే స‌హ‌నంతో ఎదుర్కొన్నాడు.  అడ‌పాద‌డ‌పా బౌండ‌రీల‌కు త‌ర‌లిస్తూ ఆసీస్ బౌల‌ర్ల‌ల‌ను అస‌హ‌నానికి గురి చేశాడు.  ఓ వైపు ఓవ‌ర్లు ద‌గ్గ‌ర‌ప‌డ‌డం.. మ‌రో వైపు కీల‌క ద‌శ‌లో ప్లేయ‌ర్లు ఔట్ అవుతున్న స‌మ‌యంలో.. పంత్ ఎంతో ఓర్పుతో బ్యాటింగ్ చేశాడు. చివ‌రి బంతి వ‌ర‌కు ఆడి.. ఇండియాకు విన్నింగ్ షాట్‌తో చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాన్ని అందించాడు.  

ఇవి కూడా చదవండి..

50 ఏళ్ల గ‌వాస్క‌ర్ రికార్డును బ‌ద్ధ‌లు కొట్టిన శుభ్‌మ‌న్ గిల్‌

అత్య‌ద్భుత సిరీస్ విజ‌యాల్లో ఇదీ ఒక‌టి: స‌చిన్‌

టీమిండియాకు 5 కోట్ల బోన‌స్

టీమిండియా విజ‌యంపై ప్ర‌ధాని మోదీ ప్ర‌శంస‌లు

ఆస్ట్రేలియాను మ‌ట్టి క‌రిపించిన టీమిండియా

నా జీవితంలో మ‌రుపు రాని రోజు ఇది: రిష‌బ్ పంత్‌

ధోనీని మించిన రిష‌బ్ పంత్‌.. కొత్త రికార్డు

VIDEOS

logo