బుధవారం 03 మార్చి 2021
Sports - Feb 23, 2021 , 17:09:25

కొత్త ఫ్రెండ్‌ను పరిచయం చేసిన పంత్‌

కొత్త ఫ్రెండ్‌ను పరిచయం చేసిన పంత్‌

అహ్మదాబాద్‌: ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో తలపడేందుకు విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు సన్నద్ధమవుతోంది.  బుధవారం నుంచి ఆరంభంకానున్న డే/నైట్‌ టెస్టు కోసం ప్రపంచంలోనే అతిపెద్ద మొతేరా స్టేడియంలో భారత క్రికెటర్లు సాధన చేస్తున్నారు.  నెట్స్‌లో సుదీర్ఘంగా ప్రాక్టీస్‌ చేశారు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు చెరో మ్యాచ్‌ నెగ్గి 1-1తో సమంగా ఉన్న స్థితిలో అహ్మదాబాద్‌లో పైచేయి సాధించేందుకు రెండు జట్లు తహతహలాడుతున్నాయి.

వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ డ్రోన్‌ కెమెరాతో సందడి చేశాడు.  డ్రోన్‌ కెమెరాతో ట్రైనింగ్‌ సెషన్‌ను వీడియో తీశాడు. తన కొత్త స్నేహితుడిని సోషల్‌ మీడియాలో అభిమానులకు పరిచయం చేశాడు.   'నేను స్టంప్స్‌ వెనుక చాలా ప్రాక్టీస్‌ చేశాను.  నెట్‌ ప్రాక్టీస్‌ను కొత్తగా చూడాలనుకున్నా. నా కొత్త ఫ్రెండ్‌ను కలవండి. నేను అతన్ని స్పైడే అని పిలుస్తాను' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్వీట్‌ చేశాడు. పంత్‌ డ్రోన్‌ కెమెరాతో సందడి చేస్తుండగా తీసిన వీడియోను షేర్‌ చేశాడు. 

VIDEOS

logo