మంగళవారం 02 మార్చి 2021
Sports - Feb 07, 2021 , 15:54:53

ప్చ్‌..పంత్‌ 91 ఔట్‌..కష్టాల్లో భారత్‌

ప్చ్‌..పంత్‌ 91 ఔట్‌..కష్టాల్లో భారత్‌

చెన్నై: ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌(91: 88 బంతుల్లో 9ఫోర్లు, 5సిక్సర్లు) సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. టీ20 తరహాలో బ్యాటింగ్‌ చేసిన పంత్‌ 57వ ఓవర్లో భారీ షాట్‌కు యత్నించి వెనుదిరిగాడు. క్రీజులో కుదురుకున్న పంత్..డామ్‌ బెస్‌ బౌలింగ్‌లో ‌ అనవసర షాట్‌కు ప్రయత్నించి వికెట్‌ పారేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 57 ఓవర్లలో 6 వికెట్లకు 225 పరుగులు చేసింది. ప్రస్తుతం అశ్విన్‌, వాషింగ్టన్‌ సుందర్‌ క్రీజులో ఉన్నారు. భారత్‌ ఇంకా 353 పరుగుల వెనుకబడి ఉంది. 

టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్లకు  భిన్నంగా పంత్‌ చెపాక్‌ మైదానంలో పరుగుల వరద పారించాడు. చివరి సెషన్‌లో అచ్చు టీ20 తరహాలో బ్యాట్‌ ఝుళిపించాడు. పుజారా‌, పంత్‌ మధ్య చక్కటి భాగస్వామ్యం ఏర్పడింది. స్పిన్నర్‌ డామ్‌ బెస్‌ బౌలింగ్‌లో పుజారా(73) అనూహ్యంగా ఔటయ్యాడు.   ఐదో  వికెట్‌కు ఈ జోడీ 100కు పైగా పరుగులు అందించింది. 

చివరి సెషన్‌లో పుజారా నిష్క్రమణతో  పంత్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో ఎదురుదాడికి దిగాడు. ఇంగ్లీష్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ బౌలింగ్‌లో పంత్‌ వీరవిహారం చేశాడు. అతని బౌలింగ్‌లో అలవోకగా భారీ సిక్సర్లు బాదేశాడు. భారత ఇన్నింగ్స్‌లో నమోదైన ఐదు సిక్సర్లు పంత్‌ కొట్టడం విశేషం. 

VIDEOS

logo