e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home టాప్ స్టోరీస్ రిష‌బ్ పంత్ స్లెడ్జింగ్‌.. త‌ర్వాతి బంతికే క్రాలీ ఔట్‌.. వీడియో

రిష‌బ్ పంత్ స్లెడ్జింగ్‌.. త‌ర్వాతి బంతికే క్రాలీ ఔట్‌.. వీడియో

రిష‌బ్ పంత్ స్లెడ్జింగ్‌.. త‌ర్వాతి బంతికే క్రాలీ ఔట్‌.. వీడియో

అహ్మ‌దాబాద్‌: వికెట్ల వెనుక రిష‌బ్ పంత్ ఎంత యాక్టివ్‌గా ఉంటాడో తెలుసు క‌దా. ఎప్పుడూ ఏదో ఒక‌టి మాట్లాడుతూ బౌల‌ర్ల‌ను, ఫీల్డ‌ర్ల‌ను ఉత్తేజ‌ప‌రుస్తూ ఉంటాడు. అదే స‌మ‌యంలో ప్ర‌త్య‌ర్థి బ్యాట్స్‌మెన్‌కు చుర‌క‌లు వేస్తూ వాళ్ల ఏకాగ్ర‌త‌ను దెబ్బ తీయ‌డానికి కూడా ప్ర‌య‌త్నిస్తూ ఉంటాడు. ఇంగ్లండ్‌తో ప్రారంభ‌మైన నాలుగో టెస్ట్‌లోనూ అత‌డు అలాగే చేశాడు. అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఇంగ్లండ్ ఓపెన‌ర్ జాక్ క్రాలీ.. పంత్ స్లెడ్జింగ్‌కు రెచ్చిపోయి త‌న వికెట్ పారేసుకున్నాడు. స‌మ్ వ‌న్ ఈజ్ యాంగ్రీ అంటూ వికెట్ల వెనుక నుంచి ప‌దే ప‌దే పంత్ అన‌డం స్టంప్స్ మైక్‌లో వినిపించింది. దీంతో ఆ త‌ర్వాతి బంతికే ముందుకు వ‌చ్చి భారీ షాట్ ఆడ‌బోయిన క్రాలీ మిడాఫ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇప్పుడీ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రిష‌బ్ పంత్ స్లెడ్జింగ్‌.. త‌ర్వాతి బంతికే క్రాలీ ఔట్‌.. వీడియో

ట్రెండింగ్‌

Advertisement