సోమవారం 08 మార్చి 2021
Sports - Jan 19, 2021 , 11:10:15

ధోనీని మించిన రిష‌బ్ పంత్‌.. కొత్త రికార్డు

ధోనీని మించిన రిష‌బ్ పంత్‌.. కొత్త రికార్డు

బ్రిస్బేన్‌: ఇండియన్ వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌.. బ్రిస్బేన్ టెస్ట్‌లో స‌రికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్ర‌మంలో అత‌డు లెజెండ‌రీ వికెట్ కీప‌ర్ ఎమ్మెస్ ధోనీని మించిపోయాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 1000 ప‌రుగుల మైలురాయిని చేరుకున్న ఇండియ‌న్ వికెట్ కీప‌ర్‌గా పంత్ నిలిచాడు. 16వ టెస్ట్ ఆడుతున్న పంత్‌.. త‌న 27వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘ‌న‌త సాధించాడు. అత‌ని కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ 2 సెంచ‌రీలు, 3 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. పంత్ కంటే ముందు ధోనీ 32 ఇన్నింగ్స్‌లో టెస్టుల్లో 1000 ప‌రుగుల మైల్‌స్టోన్‌ను చేరుకున్నాడు. ఆస్ట్రేలియా టూర్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్న పంత్‌.. కంగారూ గ‌డ్డ‌పై త‌న ప‌రుగుల ప్ర‌వాహాన్ని కొన‌సాగిస్తున్నాడు. టెస్టుల్లో వెయ్యి ప‌రుగులు చేసిన ఏడో భార‌త వికెట్ కీప‌ర్‌గా కూడా పంత్ నిలిచాడు. 

VIDEOS

logo