ఆదివారం 07 మార్చి 2021
Sports - Jan 20, 2021 , 14:36:43

రిష‌బ్ పంత్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్‌

రిష‌బ్ పంత్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్‌

దుబాయ్‌: సిడ్నీ, బ్రిస్బేన్‌ల‌లో అద్భుత‌మైన బ్యాటింగ్‌తో ఆక‌ట్టుకున్న టీమిండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌.. కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. తాజాగా ఐసీసీ రిలీజ్ చేసిన టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పంత్‌.. 13వ స్థానానికి ఎగ‌బాకాడు. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో బెస్ట్ ర్యాంక్ ఉన్న వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మ‌న్ పంతే కావ‌డం విశేషం. అతని త‌ర్వాత సౌతాఫ్రికా వికెట్ కీప‌ర్ క్వింట‌న్ డీకాక్ (15) ఉన్నాడు. పంత్ సిడ్నీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 97, బ్రిస్బేన్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 89 ప‌రుగులు చేసిన విష‌యం తెలిసిందే. సిడ్నీ టెస్ట్ డ్రా అయినా, బ్రిస్బేన్ టెస్ట్‌లో గెలిచినా.. అందులో పంత్‌దే కీల‌క‌పాత్ర‌.

ఒక స్థానం దిగ‌జారిన కోహ్లి

ఇక ఆస్ట్రేలియాతో చివ‌రి మూడు టెస్టుల‌కు దూర‌మైన కెప్టెన్ విరాట్ కోహ్లి.. నాలుగో ర్యాంక్‌కు పడిపోయాడు. ఆస్ట్రేలియా మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మ‌న్ మార్న‌స్ లబుషేన్.. కోహ్లిని వెన‌క్కి నెట్టి మూడోస్థానానికి దూసుకెళ్లాడు. ఇక తొలి రెండు స్థానాల్లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్‌, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మ‌న్ స్టీవ్ స్మిత్ కొన‌సాగుతున్నారు. 

సిరాజ్‌, గిల్‌.. పైపైకి..

ఇక చివ‌రి టెస్ట్‌లో టీమిండియా చారిత్ర‌క విజ‌యంలో త‌న వంతు పాత్ర పోషించిన ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ కూడా ర్యాంకుల్లో పైకి ఎగ‌బాకాడు. ఈ టెస్ట్‌కు ముందు 68వ స్థానంలో ఉన్న అత‌డు.. తాజాగా 47వ స్థానానికి చేరుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో గిల్ 91 ప‌రుగులు చేసిన విష‌యం తెలిసిఆందే. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల‌తో రాణించిన మ‌న హైద‌రాబాదీ సిరాజ్‌.. ఏకంగా 32 స్థానాలు ఎగ‌బాకి 45వ స్థానానికి చేరుకున్నాడు. అటు పుజారా ఒక స్థానం మెరుగుప‌ర‌చుకొని ఏడో స్థానంలో ఉన్నాడు. 


ఇవి కూడా చ‌ద‌వండి

ర‌హానే ఓట‌మెరుగ‌ని రికార్డు

మా టీమ్‌తో జాగ్ర‌త్త‌.. టీమిండియాకు పీట‌ర్స‌న్ వార్నింగ్‌

వావ్ టీమిండియా.. ఆకాశానికెత్తిన‌ ఆస్ట్రేలియన్ మీడియా

డ్రెస్సింగ్ రూమ్‌లో ర‌విశాస్త్రి స్పీచ్ చూశారా.. వీడియో

హిందూ మ‌తాన్ని కించ ప‌రిచారు.. శిక్ష త‌ప్ప‌దు!

VIDEOS

logo