శనివారం 06 జూన్ 2020
Sports - May 23, 2020 , 22:53:07

'నీ అందమైన నవ్వు గుర్తొస్తున్నది'

'నీ అందమైన నవ్వు గుర్తొస్తున్నది'

న్యూఢిల్లీ: 2009లో న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లినప్పటి జ్ఞాపకాన్ని టీమ్‌ఇండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ గుర్తుతెచ్చుకున్నాడు. ఆ పర్యటనలో సురేశ్‌ రైనా, స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజాతో కలిసి దిగిన ఓ ఫొటోను శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. కివీస్‌ పర్యటనకు వెళ్లడం అదే తమ ముగ్గురికి తొలిసారి అని గుర్తు చేసుకొని.. ఓజా నవ్వు గురించి ప్రస్తావించాడు. "2009లో.. మా ముగ్గురికి అదే తొలి న్యూజిలాండ్‌ పర్యటన. ఓజా నీ నవ్వు ఎంత అందంగా ఉందో గుర్తొస్తున్నది" అని రోహిత్‌ క్వాప్షన్‌ పెట్టాడు. కాగా ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన రోహిత్‌ శర్మ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటున్నాడు. ఆటగాళ్లతో లైవ్‌లో మాట్లాడుతూ అభిప్రాయాలను పంచుకుంటున్నాడు. తన దినచర్య సహా మిగిలిన విషయాలపై ఫొటోలను పంచుకుంటూ అభిమానులను సంతోషపరుస్తున్నాడు. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ అభిమానులకు చాలాసార్లు సూచనలు కూడా చేశాడు.  


logo