శుక్రవారం 10 జూలై 2020
Sports - Jun 07, 2020 , 01:12:21

నల్లజాతీయుడి కోసం..రెడిట్‌ సంస్థ బోర్డు పదవికి రాజీనామా చేసిన సెరెనా భర్త

నల్లజాతీయుడి కోసం..రెడిట్‌ సంస్థ బోర్డు పదవికి రాజీనామా చేసిన సెరెనా భర్త

శాన్‌ ఫ్రాన్సిస్కో: జాత్యహంకారానికి నిరసనగా.. టెన్నిస్‌ లెజెండ్‌ సెరెనా విలియమ్స్‌ భర్త, నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్‌ ‘రెడిట్‌' సహ వ్యవస్థాపకుడు అలెక్సిస్‌ ఒహానియన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.  తాను స్థాపించిన రెడిట్‌ సంస్థ బోర్డు పదవి నుంచి వైదొలిగి.. ఆ స్థానంలో నల్లజాతీయుడిని నియమించాలని కోరాడు. పోలీసుల దౌర్జన్యంతో ఫ్లాయి డ్‌ మృతి చెందినప్పటి నుంచి అమెరికా అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ నిరసనలకు మద్దతు తెలిపేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒహానియన్‌ తెలిపాడు. ‘నా కుమార్తె పెద్దయ్యాక నువ్వేం చేశావ్‌ నాన్నా? అని అడిగితే నా వద్ద సరైన సమాధానం ఉండాలి. తనకు ఈ విషయం గర్వంగా చెప్పుకుంటా. అందుకే రాజీనామా చేశా’ అని శుక్రవారం ఒహానియన్‌  అన్నాడు. logo