ఆదివారం 12 జూలై 2020
Sports - Apr 28, 2020 , 21:22:14

రిచార్జ్ చేసుకునే స‌మ‌యమిది: స‌చిన్

రిచార్జ్ చేసుకునే స‌మ‌యమిది: స‌చిన్

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ల‌భించిన ఊహించ‌ని విరామాన్ని ఆట‌గాళ్లంతా తమ బ్యాట‌రీలు రిచార్జ్ చేసుకునేందుకు వినియోగించుకోవాల‌ని క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ పేర్కొన్నాడు. అంత‌ర్జాతీయ ప్లేయ‌ర్ల‌కు త‌మ కెరీర్‌లో ఎప్పుడూ ఇంత విరామం ల‌భించ‌ద‌ని.. అలాంటిది కొవిడ్‌-19 కార‌ణంగా లాక్‌డౌన్ విధించ‌డంతో వాళ్ల‌కు కావ‌ల్సినంత స‌మ‌యం దొరికింద‌ని మాస్ట‌ర్ అన్నాడు. 

`క్రీడాకారుల‌కు కుటుంబాల‌తో గ‌డిపే స‌మ‌యం ఎక్కువుండ‌దు. అలాంటిది మ‌హ‌మ్మారి కార‌ణంగా అనుకోకుండా విరామం వ‌చ్చింది. దీన్ని ప్లేయ‌ర్లంతా స‌రిగ్గా వినియోగించుకోవాలి. త‌మ బ్యాట‌రీల‌ను రీచచార్జ్ చేసుకోవాలి. అంటే నా ఉద్దేశం కెరీర్‌ను ఓ సారి ప‌రికించి చూసుకొని లోటు పాటుల‌ను స‌వ‌రించుకోవాలి. అందుకోసం ఇదే స‌రైన త‌రుణం` అని సచిన్ చెప్పాడు.


logo