మంగళవారం 19 జనవరి 2021
Sports - Dec 27, 2020 , 20:56:51

2023 వరల్డ్‌ కప్‌ ఆడాలన్నదే నా లక్ష్యం: శ్రీశాంత్‌

2023 వరల్డ్‌ కప్‌ ఆడాలన్నదే నా లక్ష్యం: శ్రీశాంత్‌

తిరువనంతపురం: సీనియర్‌ పేసర్ ఎస్‌ శ్రీశాంత్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో పునరాగమనం చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఏడేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత అతడు మళ్లీ పోటీ క్రికెట్‌లో అడుగుపెట్టబోతున్నాడు. రాబోయే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో పాల్గొనే కేరళ ప్రాబబుల్స్‌లోనూ శ్రీశాంత్‌ చోటు దక్కించుకున్నాడు. 

'ఈ వయసులో క్రీడల్లో సాధించేది ఏమీ ఉండదనేది నిజమే. కానీ, లియాండర్ పేస్ 42 ఏండ్ల వయసులో గ్రాండ్‌స్లామ్ సాధించాడు.   రోజర్​ ఫెదరర్ కూడా ఈ వయసులో ఎలా ఆడుతున్నాడో చూడొచ్చు. ఫాస్ట్‌బౌలర్‌గా నేను  చరిత్ర సృష్టించబోతున్నా. అప్పుడే నేను చరిత్ర సృష్టించాలనుకున్నా. రాబోయే దేశవాళీ క్రికెట్‌పైనే కాదు వచ్చే మూడేళ్ల కోసం ప్రణాళికతో ఉన్నా. 2023 వరల్డ్‌కప్ టీమ్‌ తరఫున ఆడి కప్పు గెలవాలన్నదే నా నిజమైన లక్ష్యం' అని శ్రీశాంత్‌ పేర్కొన్నాడు.