శనివారం 11 జూలై 2020
Sports - Jun 11, 2020 , 19:42:42

ఐసీసీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం

ఐసీసీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం

న్యూఢిల్లీ : ఐపీఎల్‌ (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌)-2020 నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని, టీ20 ప్రపంచ కప్‌ నిర్వహణ విషయంలో ఐసీసీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని ఐపీఎల్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పాటిల్‌ తెలిపారు. దేశంలో కరోనా విజృంభనతో ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదాపడగా ఈ ఏడాది అక్టోబర్‌ 18నుంచి నవంబర్‌ 15వరకు ఆస్ట్రేలియాలో ఐసీసీ టీ20వరల్డ్‌ కప్‌ నిర్వహించాల్సి ఉంది.

సెప్టెంబర్‌ నుంచి అక్టోబర్‌ వరకు ఐపీఎల్‌ నిర్వహణకు ప్రణాళికాబద్ధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని బ్రిజేశ్‌ తెలిపారు. ప్రేక్షకులు హాజరయ్యేది.? లేనిది ఇప్పడే చెప్పలేమని.. ప్రేక్షకులు లేకున్నా టోర్నీ నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. టీ20 ప్రపంచ కప్‌ నిర్వహణ విషయంలో ఐసీసీ నిర్ణయం తీసుకోకుంటే ఐపీఎల్‌ను నిలుపుదల చేస్తామన్నారు. కాగా రానున్న పురుషుల, మహిళల క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ల నిర్వహణ విషయంలో తమ వద్ద పూర్తిస్థాయి ప్రణాళికలు ఉన్నాయని, భవిష్యత్‌ పరిస్థితులకు అనుగుణంగా వీటిపై నిర్ణయం తీసుకుంటామని ఐసీసీ తెలిపింది. 

logo