ఆదివారం 12 జూలై 2020
Sports - Apr 14, 2020 , 10:18:54

100శాతం ఫిట్‌గా ఉంటేనే రీఎంట్రీ ఇస్తా: డివిలియ‌ర్స్‌

100శాతం ఫిట్‌గా ఉంటేనే రీఎంట్రీ ఇస్తా: డివిలియ‌ర్స్‌

వంద‌కు వంద‌శాతం ఫిట్‌గా ఉంటేనే తాను రీఎంట్రీ ఇస్తాన‌ని సౌతాఫ్రికా క్రికెట‌ర్ డివిలియ‌ర్స్ వెల్ల‌డించాడు.  టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడే విష‌యంలో తాను ఎవ‌రికి ఆశ‌లు క‌ల్పించ‌న‌ని పేర్కొన్నాడు. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా నేప‌థ్యంలో అన్ని టోర్నీలు కూడా వాయిదా ప‌డ్డాయి. అయితే అక్టోబ‌ర్‌లో జ‌ర‌గాల్సిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కూడా వ‌చ్చే ఏడాదికి వాయిదా ప‌డితే ఎన్నో మార్పులు జ‌ర‌గ‌వ‌చ్చు. ప్ర‌స్తుతానికి నేను అందుబాటులో ఉన్నాను. కానీ టోర్నీ స‌మ‌యానికి ఎలా ఉంటానో..త‌న శ‌రీరం ఎలా స్పందిస్తుందో తెలియ‌ద‌న్నాడు. ప్లేయ‌ర్‌గా వంద శాతం న్యాయం చేయ‌గ‌లిగే స్థితిలో ఉంటేనే ఆడ‌తాన‌ని స్ప‌ష్టం చేశాడు డివిలియ‌ర్స్‌. మ‌రో ఆరు నెలల్లో ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేన‌న్నాడు.logo