ఆదివారం 01 నవంబర్ 2020
Sports - Sep 17, 2020 , 19:41:30

ఆర్‌సీబీ క్యాంప్‌లో చేరిన యూఏఈ కెప్టెన్‌

ఆర్‌సీబీ క్యాంప్‌లో  చేరిన యూఏఈ కెప్టెన్‌

దుబాయ్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌ యూఏఈ వేదికగా జరగనుండటంతో అన్ని జట్లు కూడా స్థానిక పరిస్థితులకు అలవాటు పడుతున్నాయి. స్లో పిచ్‌లపై సత్తాచాటేందుకు ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) ఫ్రాంఛైజీ ఇద్దరు స్థానిక ఆటగాళ్లను తమ బృందంలోకి తీసుకున్నది. యూఏఈ కెప్టెన్‌ అహ్మద్‌ రజా, 19ఏండ్ల లెగ్‌స్పిన్నర్‌ కార్తీక్‌ మీయప్పన్‌ ఆర్‌సీబీ శిక్షణా శిబిరంలో చేరారు.

స్థానిక వాతావరణం, పిచ్‌లపై అవగాహన ఉన్న వీరిద్దరూ  విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీలోని జట్టుకు సాయం చేయనున్నారు. ఐపీఎల్‌లో బెంగళూరు ఆటగాళ్లు సాధనలో వీరు కూడా పాల్గొననున్నారు. రజా ఇప్పటికే దుబాయ్‌లోని టీమ్‌ హోటల్‌లో క్వారంటైన్‌ పూర్తి చేసుకొని కోహ్లీ నేతృత్వంలోని బృందంతో శిక్షణ కూడా ప్రారంభించాడు.  బౌలింగ్‌ కోచ్‌ శ్రీధరన్‌ శ్రీరామ్‌ సలహా మేరకు  లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ రజాను ఆర్‌సీబీ క్యాంప్‌లోకి వచ్చాడు.