సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Aug 09, 2020 , 16:07:21

ఆర్‌సీబీ గురించి కొహ్లీ భావోద్వేగపూర్వక వీడియో...

ఆర్‌సీబీ గురించి కొహ్లీ భావోద్వేగపూర్వక వీడియో...

బెంగళూరు: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో మొదటినుంచి రాయల్‌ చాలెంజ్‌ బెంగళూరు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న కెప్లెన్‌ విరాట్‌కొహ్లీ ట్విట్టర్‌లో జట్టుకు సంబంధించిన ఓ భావోద్వేగంతో కూడుకున్న, ఉత్తేజకపూర్వకమైన వీడియో పెట్టాడు. ఐపీఎల్‌ ప్రారంభం నుంచి తన  క్లిప్స్‌, సహచరులతో అనుబంధాన్ని తెలిపేవి.. ముఖ్యంగా ఏబీ డివిలియర్స్‌తో ఉన్న బంధం తెలిపేలా వీడియో రూపొందించాడు. మైదానంలో ఆటగాళ్ల మధ్య ఉన్న స్నేహాన్ని కూడా ఈ వీడియోలో చూపించాడు కొహ్లీ. 

ఐపీఎల్‌ ఇంతవరకూ గెలుచుకోని ఆర్‌సీబీకి అభిమానులు మాత్రం పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఆ జట్టు రాహుల్‌ద్రావిడ్‌, కెవిన్‌ పీటర్సన్‌ను వదులుకున్నా కొహ్లీని మాత్రం వదులుకోవడం లేదు.  రెండు సీజన్ల తరువాత, కోహ్లీ ఆర్‌సీబీ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. కాగా, ఇతర భారతీయ ఆటగాళ్ల మాదిరిగానే, కొహ్లీ మార్చి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. తిరిగి క్రికెట్‌ ఆడడానికి ఉత్సాహంగా ఉన్నాడు.  31 ఏళ్ల ఈ క్రికెటర్‌ ఐపీఎల్ 2020 లోనూ ఆర్‌సీబీకి నాయకత్వం వహిస్తాడు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo