శుక్రవారం 23 అక్టోబర్ 2020
Sports - Sep 18, 2020 , 15:03:45

ఆర్‌సీబీ థీమ్‌ సాంగ్‌ చూశారా?

ఆర్‌సీబీ థీమ్‌ సాంగ్‌ చూశారా?

దుబాయ్‌: రాబోయే ఐపీఎల్‌ కోసం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) ఫ్రాంఛైజీ కొత్త ఆంథెమ్ వీడియో సాంగ్‌ను  ఆవిష్కరించింది.  అభిమానుల్లో నూతనోత్సాహాన్ని నింపాలని భావించిన  ఆర్‌సీబీ థీమ్‌ సాంగ్‌ను విడుదల చేసింది. ఐతే సాంగ్‌లో హిందీ, ఇంగ్లీష్‌ లిరిక్స్‌ ఉండటంపై ఫ్యాన్స్‌ సోషల్‌మీడియా వేదికగా విమర్శలు చేశారు. ముఖ్యంగా కన్నడ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 

బెంగళూరు ఫ్రాంఛైజీ థీమ్‌ సాంగ్‌లో కన్నడ పదాలు లేవని భారత మాజీ పేసర్‌ దొడ్డ గణేశ్‌తో సహా చాలా మంది దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు.  చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరహాలో బెంగళూరు కూడా స్థానిక భాషలకే ప్రాధాన్యం ఇవ్వాలని ఓ నెటిజన్‌ కోరాడు. ఇంగ్లీష్‌, కన్నడను ఉపయోగించండి కానీ, హిందీ భాషను మాత్రం మాపై రుద్దే ప్రయత్నం చేయొద్దని మరొకరు విజ్ఞప్తి చేశారు.

సోషల్‌మీడియాలో విమర్శలు రావడంతో కన్నడ అభిమానుల కోసం కన్నడ వెర్షన్‌ థీమ్‌ సాంగ్‌ను ఆర్‌సీబీ  విడుదల చేసింది.    ఆర్‌సీబీ ఐపీఎల్‌ థీమ్‌ సాంగ్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఇప్పటికే  10  లక్షలకు పైగా ఈ వీడియోను  వీక్షించారు.
logo