e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home స్పోర్ట్స్ బెంగళూరు బోణీ

బెంగళూరు బోణీ

బెంగళూరు బోణీ
  • సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఓటమి
  • హర్షల్‌కు ఐదు వికెట్లు
  • రాణించిన డివిలియర్స్‌, మ్యాక్స్‌వెల్‌
  • గత ఎనిమిది సీజన్‌లుగా లీగ్‌లో తొలి మ్యాచ్‌ ఓడుతూ వస్తున్న ముంబై
  • ముంబై ఇండియన్స్‌పై ఐదు వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా హర్షల్‌ పటేల్‌ రికార్డులకెక్కాడు.
  • సీజన్‌ తొలి మ్యాచ్‌ ఓడటం ముంబై ఇండియన్స్‌కు ఇది వరుసగా తొమ్మిదోసారి.

ఇండియన్స్‌ ఈ సారి కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించింది. నెమ్మదిగా ఆరంభించి గేర్లు మార్చుతూ టాప్‌కు వెళ్లే తమ అలవాటుకు కట్టుబడి రోహిత్‌ సేన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలవగా.. చెపాక్‌ వేదికగా ఆడిన గత ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఈసారి బోణీ కొట్టింది. బౌలింగ్‌లో నయా సంచలనం హర్షల్‌ పటేల్‌ ఐదు వికెట్లతో అల్లాడించగా.. బ్యాటింగ్‌లో రన్‌మెషీన్‌ విరాట్‌కోహ్లీ, గతేడాది ఏమాత్రం ఆకట్టుకో లేకపోయిన మ్యాక్స్‌వెల్‌, మిస్టర్‌ 360 ఏబీ డివిలియర్స్‌ దంచికొట్టడంతో కోహ్లీసేన సునాయాస విజయం సొంతం చేసుకుంది.
చెన్నై: కట్టుదిట్టమైన బౌలింగ్‌కు బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌ తోడవడంతో బెంగళూరు బోణీ కొట్టింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం జరిగిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 14వ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా ఎలాంటి అట్టహాస ఆరంభ కార్యక్రమాలు లేకుండానే మొదలైన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు చేసింది. క్రిస్‌ లిన్‌ (35 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) తృటిలో అర్ధశతకం చేజార్చుకోగా.. యువ ఆటగాళ్లు సూర్యకుమార్‌ యాదవ్‌ (31), ఇషాన్‌ కిషన్‌ (28) ఫర్వాలేదనిపించారు.

బెంగళూరు బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ (5/27) అదరగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో బెంగళూరు సరిగ్గా 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. డివిలియర్స్‌ (27 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్‌ (39; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్‌ కోహ్లీ (33) రాణించారు. ముంబై బౌలర్లలో బుమ్రా, జాన్‌సెన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. హర్షల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.
ఓపెనర్‌గా సుందర్‌
ఓ మోస్తరు లక్ష్యఛేదనలో బెంగళూరు కూడా తడబడింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో కలిసి ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (10) ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. అయితే ఈ ప్రయోగం పెద్దగా ఫలించలేదు. టీమ్‌ఇండియా తరఫున టెస్టుల్లో లోయర్‌ ఆర్డర్‌లో ధాటిగా బ్యాటింగ్‌ చేసిన సుందర్‌.. బౌల్ట్‌, బుమ్రాలను ఎదుర్కోవడంలో తడబడ్డాడు. రజత్‌ పాటిదార్‌ (8) కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోగా.. విరాట్‌ కొన్ని చక్కటి షాట్లతో అలరించాడు. ముఖ్యంగా గతేడాది పంజాబ్‌ తరఫున పూర్తిగా నిరాశ పరిచిన మాక్స్‌వెల్‌ ఫామ్‌లోకి రావడం బెంగళూరుకు ఊరటనిచ్చింది.

13వ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడి ఒక్క సిక్సర్‌ కొట్టలేకపోయిన మాక్సీ.. రెండు భారీ సిక్సర్లతో అభిమానులను అలరించాడు. కీలక సమయంలో విరాట్‌, మాక్స్‌వెల్‌ ఔటైనా.. బాధ్యతలు భుజానెత్తుకున్న డివిలియర్స్‌ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 18 బంతుల్లో 34 పరుగులు అవసరమైన దశలో డివిలియర్స్‌ మూడు ఫోర్లు, సిక్సర్‌ బాదడంతో సమీకరణం ఆరు బంతుల్లో ఏడు పరుగులకు చేరింది.చివర్లో ఏబీ రనౌటైనా.. హర్షల్‌ పటేల్‌ (4 నాటౌట్‌) అజేయంగా జట్టును గెలిపించాడు.

టాస్‌ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు శుభారంభం దక్కలేదు. ఓ ఫోర్‌, సిక్స్‌తో మంచి టచ్‌లో కనిపించిన ముంబై కెప్టెన్‌, హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ (19)రనౌట్‌ కావడంతో ముంబై ఇండియన్స్‌ 24 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. నాన్‌స్ట్రయికర్‌ లిన్‌ పిలుపుతో లేని పరుగుకు ప్రయత్నించిన రోహిత్‌ పెవిలియన్‌ చేరాడు.

సూర్యకుమార్‌ బౌండ్రీతో ఖాతా తెరువగా.. మరో ఎండ్‌లో లిన్‌ నిలకడగా ఆడటంతో.. ఆరు ఓవర్లలో ముంబై 41/1తో నిలిచింది. రెండో వికెట్‌కు 70 పరుగులు జోడించాక సూర్యకుమార్‌ ఔట్‌ కాగా.. లిన్‌ను వాషింగ్టన్‌ సుందర్‌ బుట్టలో వేసుకున్నాడు. అక్కడి నుంచి హర్షల్‌ మ్యాజిక్‌ స్టార్ట్‌ అయింది. ముందు హార్దిక్‌ పాండ్యా (13)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న హర్షల్‌.. తదుపరి ఓవర్‌లో ఇషాన్‌ను కూడా పెవిలియన్‌ బాట పట్టించాడు. ఇక ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో కృనాల్‌ (7), పొలార్డ్‌ (7)ను వరుస బంతుల్లో ఔట్‌ చేసిన హర్షల్‌.. జాన్‌సెన్‌ (0)ను కూడా డగౌట్‌ పంపాడు. ఇన్నింగ్స్‌ చివరి బంతికి రాహుల్‌ చాహర్‌ రనౌటవడంతో ముంబై ఆఖరి ఓవర్‌లో ఒక పరుగు మాత్రమే చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. ముంబై చివరి నాలుగు ఓవర్లలో ఆరు వికెట్లకు 25 రన్స్‌ మాత్రమే చేసింది.
స్కోరు బోర్డు
ముంబై: రోహిత్‌ (రనౌట్‌) 19, లిన్‌ (సి అండ్‌ బి) సుందర 49, సూర్యకుమార్‌ (సి) డివిలియర్స్‌ (బి) జెమీసన్‌ 31, ఇషాన్‌ (ఎల్బీ) హర్షల్‌ 28, హార్దిక్‌ (ఎల్బీ) హర్షల్‌ 13, పొలార్డ్‌ (సి) సుందర్‌ (బి) హర్షల్‌ 7, కృనాల్‌ (సి) క్రిస్టియన్‌ (బి) హర్షల్‌ 7, జాన్‌సెన్‌ (బి) హర్షల్‌ 0, రాహుల్‌ చాహర్‌ (రనౌట్‌) 0, బుమ్రా (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 159/9. వికెట్ల పతనం: 1-24, 2-94, 3-105, 4-135, 5-145, 6-158, 7-158, 8-158, 9-159, బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-22-0, జెమీసన్‌ 4-0-27-1, చాహల్‌ 4-0-41-0, షాబాజ్‌ 1-0-14-0, హర్షల్‌ 4-0-27-5, క్రిస్టియన 2-0-21-0, సుందర్‌ 1-0-7-1.
బెంగళూరు: సుందర్‌ (సి) లిన్‌ (బి) కృనాల్‌ 10, కోహ్లీ (ఎల్బీ) బుమ్రా 33, రజత్‌ (బి) బౌల్ట్‌ 8, మ్యాక్స్‌వెల్‌ (సి) లిన్‌ (బి) జాన్‌సెన్‌ 39, డివిలియర్స్‌ (రనౌట్‌) 48, షాబాజ్‌ (సి) కృనాల్‌ (బి) జాన్‌సెన్‌ 1, క్రిస్టియన్‌ (సి) రాహుల్‌ చాహర్‌ (బి) బుమ్రా 1, జెమీసన్‌ (రనౌట్‌/బుమ్రా) 4, హర్షల్‌ (నాటౌట్‌) 4, సిరాజ్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 12, మొత్తం: 20 ఓవర్లలో 160/8. వికెట్ల పతనం: 1-35, 2-45, 3-98, 4-103, 5-105, 6-122, 7-152, 8-158, బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-36-1, బుమ్రా 4-0-26-2, జాన్‌సెన్‌ 4-0-28-2, కృనాల్‌ 4-0-25-1, రాహుల్‌ చాహర్‌ 4-0-43-0.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బెంగళూరు బోణీ

ట్రెండింగ్‌

Advertisement