శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sports - Sep 22, 2020 , 19:43:19

IPL 2020: రాజస్థాన్‌తో మ్యాచ్‌కు రాయుడు దూరం

IPL 2020: రాజస్థాన్‌తో మ్యాచ్‌కు రాయుడు దూరం

షార్జా   ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా షార్జా వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌కు చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడు దూరమయ్యాడు. రాయుడు ఫిట్‌గా లేకపోవడంతో ఇవాళ్టి మ్యాచ్‌లో ఆడటం లేదని కెప్టెన్‌ ధోనీ తెలిపాడు.  అతని స్థానంలో యువ బ్యాట్స్‌మన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కు తుది జట్టులో చోటు దక్కింది. కరోనా సోకడంతో 23ఏండ్ల మహారాష్ట్ర బ్యాట్స్‌మన్‌ గైక్వాడ్‌ రెండు వారాలకు పైగా క్వారంటైన్‌లో ఉన్నాడు. 

వరుసగా రెండు పరీక్షల్లో కరోనా నెగెటివ్‌గా రావడంతో రాజస్థాన్‌తో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు.  ఐపీఎల్‌ 13వ సీజన్‌ ఆరంభ పోరులో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో  తన అద్భుత బ్యాటింగ్‌ విన్యాసంతో ఆకట్టుకున్న  రాయుడు జట్టుకు విజయాన్నందించాడు.   రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ బౌలింగ్‌ ఎంచుకున్నాడు.