గురువారం 04 మార్చి 2021
Sports - Jan 20, 2021 , 10:09:44

డ్రెస్సింగ్ రూమ్‌లో ర‌విశాస్త్రి స్పీచ్ చూశారా.. వీడియో

డ్రెస్సింగ్ రూమ్‌లో ర‌విశాస్త్రి స్పీచ్ చూశారా.. వీడియో

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాపై టీమిండియా చారిత్ర‌క విజ‌యం త‌ర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ప్లేయ‌ర్స్ ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. ఈ సంద‌ర్భంగా కోచ్ ర‌విశాస్త్రి ఈ సంచ‌ల‌న విజ‌యానికి కార‌ణ‌మైన ప్లేయ‌ర్స్‌ను ఉద్దేశించి స్ఫూర్తిదాయ‌క ప్ర‌సంగం చేశాడు. గ‌బ్బా కోట‌ను బ‌ద్ధ‌లు కొట్ట‌డంలో కీల‌క‌పాత్ర పోషించిన పుజారా, శుభ్‌మ‌న్ గిల్‌, రిష‌బ్ పంత్‌, శార్దూల్ ఠాకూర్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌ల‌ను అత‌ను ఆకాశానికెత్తాడు. ఇలాంటి సంద‌ర్భాలు మ‌ళ్లీ మ‌ళ్లీ రావ‌ని.. ఈ క్ష‌ణాన్ని పూర్తిగా ఆస్వాదించాల‌ని ప్లేయ‌ర్స్‌కు సూచించాడు. ముఖ్యంగా కెప్టెన్ ర‌హానే టీమ్‌ను ముందుండి న‌డిపించిన తీరును ర‌విశాస్త్రి ప‌దేప‌దే ప్ర‌స్తావించాడు. ఈ ప్ర‌సంగానికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట‌ర్‌లో పోస్ట్ చేసింది. ఇందులో ప్లేయ‌ర్స్ అంతా ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ఈ స్పీచ్‌కు సంబంధించి మొత్తం వీడియో కోసం కింద ట్వీట్‌లో ఉన్న బీసీసీఐ టీవీ లింక్ క్లిక్ చేయండి.

VIDEOS

logo