మంగళవారం 02 మార్చి 2021
Sports - Feb 02, 2021 , 11:04:07

టీమిండియా ప్రాక్టీస్ షురూ.. కోచ్ ర‌విశాస్త్రి స్పీచ్‌

టీమిండియా ప్రాక్టీస్ షురూ.. కోచ్ ర‌విశాస్త్రి స్పీచ్‌

చెన్నై: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ కోసం ఇండియ‌న్ టీమ్ మంగ‌ళ‌వారం ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఈ సందర్భంగా కోచ్ ర‌విశాస్త్రి టీమ్‌కు సందేశ‌మిచ్చాడు. శుక్ర‌వారం ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కోహ్లి సేన ప్రాక్టీస్ ప్రారంభించింది. సెష‌న్ మొద‌ల‌య్యే ముందు టీమ్‌ను ఉద్దేశించి శాస్త్రి మాట్లాడాడు. దీనికి సంబంధించిన ఫొటోల‌ను బీసీసీఐ త‌న ట్విట‌ర్ హ్యాండిల్‌‌లో పోస్ట్ చేసింది. త‌న ఉత్తేజ‌భ‌రిత ప్ర‌సంగంతో ర‌విశాస్త్రి టీమ్‌కు వెల్‌క‌మ్ చెప్పాడ‌ని బీసీసీఐ ఈ సంద‌ర్భంగా కామెంట్ చేసింది. ఆ త‌ర్వాత కెప్టెన్ కోహ్లి కూడా టీమ్ స‌భ్యుల‌తో  మాట్లాడాడు. వారం రోజుల ముందు చెన్నై చేరిన టీమ్ స‌భ్యులు.. ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్న త‌ర్వాత సోమ‌వారం ఔట్‌డోర్ ప్రాక్టీస్‌కు వ‌చ్చింది. 

VIDEOS

logo