గురువారం 21 జనవరి 2021
Sports - Dec 26, 2020 , 17:26:26

జడేజా ఈ క్యాచ్‌ ఎలా అందుకున్నాడో చూడండి!

జడేజా ఈ క్యాచ్‌ ఎలా అందుకున్నాడో చూడండి!

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఫీల్డింగ్‌ విన్యాసం అందరినీ ఆకట్టుకున్నది. మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతోన్న బాక్సింగ్‌ డే టెస్టు మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్నది.   తొలి రోజు ఆటలో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 13వ ఓవర్లో జడేజా అద్భుత క్యాచ్‌కు ఆస్ట్రేలియా ఓపెనర్‌ మాథ్యూ వేడ్‌ వెనుదిరిగాడు. అశ్విన్‌ వేసిన బంతిని భారీ షాట్‌ ఆడేందుకు మాథ్యూ ప్రయత్నించగా  బంతి గాల్లో లేచింది. ఈ బాల్‌ను అందుకునేందుకు జడ్డూతో పాటు శుభ్‌మన్‌ గిల్‌ కూడా పరుగెత్తాడు.

బంతివైపు చూస్తూ పరుగెత్తిన జడ్డూ తాను క్యాచ్‌ అందుకుంటానని చేతులతో సిగ్నల్‌ ఇవ్వగా దీన్ని గిల్‌ చూడలేదు. ఇద్దరూ క్యాచ్‌ కోసం పోటీపడగా జడేజా మాత్రం గిల్‌ను బలంగా ఢీకొనకుండా  క్యాచ్‌ అందుకున్నాడు. ప్రస్తుతం జడ్డూ ఫీల్డింగ్‌ నైపుణ్యంపై  సోషల్‌ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. వీడియో కాస్త  వైరల్‌గా మారింది.  


logo