టెస్టు సిరీస్ నుంచి జడేజా ఔట్?

న్యూఢిల్లీ: గాయం కారణంగా టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు దూరమైన విషయం తెలిసిందే. సిరీస్‌లోని మిగతా టెస్టులకు జడేజా అందుబాటులో ఉండే అవకాశం లేదని సమాచారం. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మొదటి రెండు టెస్టులకు మాత్రమే బీసీసీఐ జట్లను ప్రకటించింది. ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ టెస్టులో జడేజా బొటనవేలుకి పెద్ద దెబ్బ తగిలింది. దీంతో బ్రిస్బేన్‌లో జరిగిన ఆఖరి టెస్టులో అతడు పాల్గొనలేదు. ఆక్కడే వేలుకి శస్త్రచికిత్స చేయించుకున్న జడేజా ప్రస్తుతం కోలుకుంటున్నాడు.
సిడ్నీలో హ్యాండ్ స్పెషలిస్ట్‌ను సంప్రదించిన జడేజా స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత గాయం నుంచి కోలుకునేందుకు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరాడు. 32ఏండ్ల జడేజా మూడు, నాలుగు టెస్టులకు అందుబాటులోకి వస్తాడని భారత టీమ్ మేనేజ్మెంట్ భావించింది. అనుకున్న సమయంలోగా జడ్డూ కోలుకొని పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశాలు లేవని తెలుస్తోంది.
ఒకవేళ జడేజా ఆడేందుకు రెడీగా ఉన్నా తుది జట్టులో చేరడానికి ముందు తప్పనిసరి క్వారంటైన్ పూర్తి చేయాల్సి ఉంది. ఇంగ్లాండ్ టెస్టులకు జడేజా దాదాపు దూరమైనట్లే, పరిమిత ఓవర్ల సిరీస్‌కు అందుబాటులోకి వస్తాడా అనేది కూడా స్పష్టంగా తెలియట్లేదు. చివరి రెండు టెస్టులకు అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనుంది.
తాజావార్తలు
- రాఫెల్ స్ఫూర్తితో.. ‘పంజాబ్ రాఫెల్’ వాహనం
- కురుమల మేలుకోరే పార్టీ టీఆర్ఎస్ : ఎమ్మెల్సీ కవిత
- టీ బ్రేక్..ఇంగ్లాండ్ 144/5
- ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్.. ఇండియాలో బెంగళూరే బెస్ట్
- ఉప్పెన చిత్ర యూనిట్‌కు బన్నీ ప్రశంసలు
- ఓటీటీలో పోర్న్ కూడా చూపిస్తున్నారు : సుప్రీంకోర్టు
- సవాళ్లను ఎదుర్కొంటున్న భారత సైన్యం : సీడీఎస్ బిపిన్ రావత్
- షాకింగ్ : లైంగిక దాడిని ప్రతిఘటించిన దళిత బాలిక హత్య!
- ప్రమీలా జయపాల్‌కు అమెరికాలో అత్యున్నత పదవి
- ఓటీటీ నియంత్రణలపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు