శుక్రవారం 22 జనవరి 2021
Sports - Jan 09, 2021 , 18:39:06

టెస్టు సిరీస్‌ నుంచి జడేజా ఔట్‌?

టెస్టు సిరీస్‌ నుంచి జడేజా ఔట్‌?

సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమ్‌ఇండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్‌తో మూడో టెస్టులో గాయపడిన  భారత ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా సిరీస్‌ మొత్తానికి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్‌లో కీలక  ఆటగాళ్లను కోల్పోయిన భారత్‌కు జడేజా కూడా దూరమవడం కోలుకోలేని ఎదురుదెబ్బ అవుతుంది.

మూడో టెస్టు మూడో రోజు ఆటలో ఆసీస్‌ స్పీడ్‌స్టర్‌ మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో  బౌన్సర్‌ను తప్పించుకునేందుకు ప్రయత్నించగా  బంతి  జడేజా  ఎడమచేతి బొటనవేలికి  బలంగా తాకింది. ఫిజియో పరిశీలించిన తర్వాత జడ్డూ బ్యాటింగ్‌ కొనసాగించాడు. అనంతరం ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ సమయంలో జడేజా డ్రెస్సింగ్‌ రూమ్‌లోనే విశ్రాంతి తీసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో పంత్‌ కూడా గాయపడటంతో ఇద్దరినీ వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించినట్లు బీసీసీఐ పేర్కొంది.  స్కానింగ్‌లో జడేజా ఎడమ బొటనవేలు ఫ్రాక్చర్‌ అయినట్లు తేలిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.  ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే జడేజా  మ్యాచ్‌లు ఆడడం అనుమానమే.logo