దుబాయ్: ఐసీసీ బుధవారం రిలీజ్ చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్ల లిస్ట్‌లో నంబర్‌వన్‌గా నిలిచాడు. 386 పాయింట్లతో జడేజా టాప్‌లోకి దూసుకెళ్లాడు. అతని తర్వాతి స్థానాల్లో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ జేసన్ హోల్డర్, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఉన్నారు. 2017 ఆగస్ట్ తర్వాత ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా నంబర్ వన్‌లోకి రావడం ఇదే తొలిసారి. ఇక బౌలర్ల జాబితాలో అశ్విన్ రెండోస్థానంలో ఉన్నాడు. బ్యాట్స్‌మెన్ లిస్ట్‌లో కెప్టెన్ కోహ్లి 4వ స్థానంలో ఉండగా.. వికెట్ కీపర్ రిషబ్ పంత్, రోహిత్ శర్మ సంయుక్తంగా ఆరో స్థానంలో ఉన్నారు.