బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Mar 19, 2020 , 00:19:11

భూమి సవాల్‌ విసురుతున్నది

 భూమి సవాల్‌ విసురుతున్నది

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచిస్తూ టీమ్‌ఇండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ ఆశ్విన్‌ బుధవారం ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. ‘మానవాళికి భూమి సవాల్‌ విసురుతున్నది. సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉండగలమా, ఎదుటివారి క్షేమం కోసం నిజాయితీగా మెలగగలమా, స్వీయ నిర్బంధం విధించుకోగలమా అని ప్రశ్నిస్తున్నది. సమాధానమిచ్చేందుకు ఇవి కఠినమైన ప్రశ్నలని ఆలోచిస్తున్నారా. సురక్షితంగా ఉండండి, సమాధానాలివ్వండి’ అని అశ్విన్‌ ట్వీట్‌ చేశాడు. 


logo