శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Sep 29, 2020 , 14:57:19

DCvSRH: ఢిల్లీని ఆపతరమా!

DCvSRH: ఢిల్లీని ఆపతరమా!

దుబాయ్‌: వరుస విజయాలతో ఊపుమీదున్న  ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు  మంగళవారం  మరో పోరుకు సిద్ధమైంది.  ఐపీఎల్‌-13లో  అటు బౌలింగ్‌, ఇటు బ్యాటింగ్‌లో తిరుగులేని ప్రదర్శన చేస్తున్న ఢిల్లీ టీమ్‌ ఇవాళ రాత్రి  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఢీకొంటుంది.  టోర్నీలో ఆడిన రెండు (బెంగళూరు, కోల్‌కతా) మ్యాచ్‌ల్లో ఓటమి ఎదుర్కొన్న  సన్‌రైజర్స్‌  కుర్రాళ్లతో   కళకళలాడుతున్న ఢిల్లీతో సమరానికి సిద్ధమైంది. 

పంజాబ్‌తో మ్యాచ్‌లో గాయపడిన ఢిల్లీ సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు దూరంకానున్నాడు. బ్యాట్స్‌మెన్‌ నిలకడగా ఆడకపోవడంతో టోర్నీలో  సన్‌రైజర్స్‌ అనుకున్న ఫలితాలు సాధించలేకపోతున్నది. గాయం నుంచి కోలుకొని ఫిట్‌నెస్‌ సాధించిన  కేన్‌ విలియమ్సన్‌ ఇవాళ మ్యాచ్‌ ఆడే అవకాశం ఉన్నది.

మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం వరుసగా రెండో మ్యాచ్‌లోనూ కొనసాగింది. పేపర్‌ మీద పటిష్టంగా కనిపిస్తున్న వార్నర్‌సేన  స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక కీలక సమయాల్లో చేతులెత్తేస్తున్నది. అబుదాబి వేదికగా జరిగే పోరులో ఎలాగైనా ఢిల్లీని ఓడించి పాయింట్ల ఖాతా తెరువాలని  హైదరాబాద్‌ పట్టుదలతో ఉన్నది.   ఓపెనర్లు బెయిర్‌స్టో, వార్నర్‌ రాణించడం సహా మిడిలార్డర్‌లో స్లో బ్యాటింగ్‌ను వీడితేనే జట్టు గెలిచే అవకాశాలు ఉన్నాయి.