శనివారం 28 నవంబర్ 2020
Sports - Sep 20, 2020 , 23:04:53

ఢిల్లీకి షాక్‌...అశ్విన్‌కు గాయం

ఢిల్లీకి షాక్‌...అశ్విన్‌కు గాయం

దుబాయ్‌: ఐపీఎల్-13వ సీజన్‌లో భాగంగా కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ గాయపడ్డాడు. పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో ఆరో ఓవర్‌ వేసిన  అశ్విన్‌ రెండు కీలక వికెట్లు తీశాడు. తన తొలి ఓవర్‌ మొదటి బంతికే కరుణ్‌ నాయర్‌ను పెవిలియన్‌ పంపిన అశ్విన్‌...ఐదో బంతికి నికోలస్‌ పూరన్‌ను బౌల్డ్‌ చేశాడు. ఓవర్‌ ఆఖరి బంతిని  మాక్స్‌వెల్‌ లాంగాన్‌ వైపు ఆడగా బంతిని ఆపేందుకు అశ్విన్‌ డైవ్‌ చేశాడు.

బంతిని అడ్డుకునే క్రమంలో అశ్విన్‌ ఎడమ భుజానికి బలంగా దెబ్బ తగిలింది. దీంతో ఫిజియో సహాయంతో అశ్విన్‌ మైదానాన్ని వీడాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఒకే ఒక్క ఓవర్‌ వేసిన అశ్విన్‌ రెండు వికెట్లు పడగొట్టి రెండు పరుగులే ఇచ్చాడు. ఆఫ్‌స్పిన్నర్‌ అశ్విన్‌ స్థానంలో అజింక్య రహానె ఫీల్డర్‌గా వచ్చాడు.