గురువారం 25 ఫిబ్రవరి 2021
Sports - Feb 15, 2021 , 16:01:40

చెపాక్‌ టెస్టు: ఇంగ్లాండ్‌ టార్గెట్‌ 482

చెపాక్‌ టెస్టు: ఇంగ్లాండ్‌ టార్గెట్‌ 482

చెన్నై: ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో ఆతిథ్య భారత్‌ తిరుగులేని స్థితిలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో  రవిచంద్రన్‌ అశ్విన్‌(106) మెరుపు శతకానికి తోడు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(62) అర్ధసెంచరీతో రాణించడంతో 286 పరుగులకు ఆలౌటైంది.  తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 195 పరుగులు కలుపుకొని ఇంగ్లాండ్‌కు భారత్‌ 482 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లాండ్‌  స్పిన్నర్లు మెయిన్‌ అలీ(4/98), జాక్‌ లీచ్‌(4/100) మాత్రమే వికెట్లు పడగొట్టారు.  టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ విఫలమైన  అశ్విన్‌ మాత్రం చెలరేగిపోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్‌మెన్ తడబడినప్పటికీ అశ్విన్‌  ఇంగ్లీష్‌ బౌలర్లకు  ధీటుగా సమాధానం చెప్పాడు. కష్టంగా మారుతున్న పిచ్‌పై గొప్ప ప్రదర్శన చేశాడు. 

భారత్‌ 

తొలి ఇన్నింగ్స్‌:329

రెండో ఇన్నింగ్స్‌:286

ఇంగ్లాండ్‌

తొలి ఇన్నింగ్స్‌:134

VIDEOS

logo