సోమవారం 18 జనవరి 2021
Sports - Nov 24, 2020 , 20:25:14

శ్రేయస్‌ అయ్యర్‌కు టెస్టు జట్టులో చోటు?

శ్రేయస్‌ అయ్యర్‌కు టెస్టు జట్టులో చోటు?

 ముంబై: ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు  బ్యాట్స్‌మన్‌  రోహిత్ శర్మ‌, సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ అందుబాటులో ఉండరని తెలుస్తోంది.   చివరి రెండు టెస్టులకు కూడా రోహిత్‌, ఇషాంత్‌ ఆడటం అనుమానమేనని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.  ప్రస్తుతం రోహిత్‌, ఇషాంత్‌  గాయాల నుంచి పూర్తిగా కోలుకునేందుకు బెంగళూరులోని ఎన్‌సీఏలో ఉన్నారు. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించేందుకు కనీసం 4 వారాలు పట్టే అవకాశమున్నట్లు సమాచారం.  వచ్చే నెల 27 నుంచి భారత్‌, ఆస్ట్రేలియా మధ్య 4 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆరంభంకానుంది. 

పరిమిత ఓవర్ల సిరీస్‌కు మాత్రమే ఎంపికైన శ్రేయస్‌ అయ్యర్‌ను టెస్టు సిరీస్‌కు రిజర్వ్‌ బ్యాట్స్‌మన్‌గా కొనసాగించాలని బీసీసీఐ భావిస్తోంది.  

'రోహిత్,  ఇషాంత్‌ వచ్చిన తర్వాత ఏ ఒక్క కొత్త ఆటగాడు ఇక్కడికి వచ్చే అవకాశం లేదు.   ఈ కారణంగానే సెలెక్టర్లు ఇప్పటికే జంబో స్క్వాడ్‌ను ఎంపిక చేశారు.  అవసరమైతే, శ్రేయాస్‌ను  తిరిగి ఇక్కడే ఉండమని కోరనున్నట్లు'   బీసీసీఐ వర్గాలు తెలిపాయి.