శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sports - Oct 29, 2020 , 13:58:44

సూర్య.. నీకో దండం

సూర్య.. నీకో దండం

హైద‌రాబాద్‌:  ఆస్ట్రేలియా టూర్ వెళ్ల‌నున్న ఇండియా జ‌ట్టులో సూర్య కుమార్‌కు చోటు ద‌క్క‌క‌పోవ‌డం ప‌ట్ల విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  ఇక గ‌త రాత్రి ఐపీఎల్ టోర్నీలో ఆర్‌సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ప్లేయ‌ర్ సూర్య కుమార్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.  ఆ త‌ర్వాత అత‌ని ఆట‌ను కీర్తిస్తూ టీమిండియా హెడ్ కోచ్ ర‌విశాస్త్రీ ఓ ట్వీట్ చేశారు.  సూర్య న‌మ‌స్కారం అంటూ చేతులు జోడించిన ఓ ఎమోజీని పోస్టు చేశారు. ఓపిక‌గా, ధైర్యంగా ఉండాలంటూ కామెంట్ చేశారు. అయితే ఆస్ట్రేలియా టూర్‌కు ముంబై  ప్లేయ‌ర్ రోహిత్ శ‌ర్మ‌తో పాటు సూర్య కుమార్ కూడా ఎంపిక కాలేదు.  ఐపీఎల్‌లో దుమ్మురేపుతున్న సూర్య‌కుమార్‌ను ఎందుకు ఆసీస్ టూర్‌కు ఎంపిక చేయ‌లేద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  బుధ‌వారం మ్యాచ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆర్సీబీ కెప్టెన్  కోహ్లీ.. ముంబై ప్లేయ‌ర్ సూర్య కుమార్‌ను స్లెడ్జింగ్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.  ఇంట‌ర్నెట్‌లో కొంద‌రు ఆ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోల‌ను పోస్టు చేశారు.  స్థిరంగా ఆడుతున్న సూర్య‌కుమార్‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు కోహ్లీపై నెటిజ‌న్స్ కామెంట్ చేశారు. ఆర్సీబీపై 79 ర‌న్స్ చేసి నాటౌట్‌గా నిలిచిన సూర్య కుమార్‌.. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.