ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Aug 03, 2020 , 22:25:19

‘విరాట్ ​- శాస్త్రి భాగస్వామ్యం సూపర్​’

‘విరాట్ ​- శాస్త్రి భాగస్వామ్యం సూపర్​’

న్యూఢిల్లీ: టీమ్​ఇండియా హెడ్​కోచ్ రవిశాస్త్రి – కెప్టెన్ విరాట్ కోహ్లీ భాగస్వామ్యం జట్టుకు మంచి ఫలితాలను ఇస్తున్నదని మాజీ పేసర్ ఆశీష్ నెహ్రా అన్నాడు. వారిద్దరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారని అన్నాడు. అలాగే మాజీ హెడ్​కోచ్ అనిల్ కుంబ్లే – విరాట్ కాంబినేషన్ ఎందుకు ఎక్కువ కాలం సాగలేదో తన అభిప్రాయాన్ని సోమవారం క్రికెట్ కనెక్టెడ్ షోలో నెహ్రా వ్యక్తం చేశాడు.

“కోచ్​, కెప్టెన్ ఎంతో సమన్వయంతో కలిసి పనిచేయాలి. జట్టే తొలి ప్రాధాన్యం కావాలి. 8-9 నెలలు పనిచేశాక… తుది జట్టు కూర్పుతో సహా కొన్ని విషయాల్లో  కొన్ని విభేదాలు రావొచ్చు. అవన్నీ విధి నిర్వహణలో భాగమే అయితే నమ్మకమే ముఖ్యం. ఇద్దరూ ఒకేలా ఉండడం ప్రతీసారి జరుగదు. తుది నిర్ణయం అనేది ఒకరి చేతిలో ఉండకూడదు. 50-50గా ఉండాలి. ఒకవేళ అది 49-51గా ఉన్నా కొందరికి ఇబ్బందే. అందుకే అనిల్ కుంబ్లే-విరాట్ కోహ్లీ పార్ట్​నర్ షిప్ సరిగా పనిచేయలేదు. వారిద్దరు విభిన్నమైన ఆలోచనలు ఉన్న వ్యక్తులు కాబట్టే ఇలా జరిగిందని నా అభిప్రాయం. ఆ తర్వాత వచ్చిన రవిశాస్త్రి,, కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. కోహ్లీకి కావాల్సిన స్వేచ్ఛను రవిశాస్త్రి ఇచ్చాడు. ఎంతో నమ్మకం చూపాడు. విరాట్​- శాస్తి ఇద్దరూ ఒకేలాంటి వ్యక్తులు” అని నెహ్రా చెప్పాడు. కాగా కోహ్లీతో విభేదాల కారణంగా హెడ్​కోచ్ పదవి నుంచి స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే 2017లో తప్పుకున్నాడు. ఆ తర్వాత ఆ స్థానంలో రవిశాస్త్రి వచ్చాడు. 


logo